Neela Neelamma Cheralo Neela song lyrics from the latest Folk song new Private Songs Free Download. The song has released on Feb 19, 2022, and has more than 3 million views on the youtube channel.
Neela Neelamma Cheralo Neela Song Lyrics in Telugu
నీల నీలం సీరాలో నీల నింగిలో వెన్నలవే నా నీల
నింగిలో వెన్నెలవే నా నీల
మాయ మాటల తుంటరి వాడ మాయలు చేయకురా నా బావ సైగలు ఏయకురా నా బావ
ఓయ్యరాల నడక దాన ఒంపు సొంపులు అందం దాన
నెమలి కన్నుల సిన్నదాన నెగలలేని అందం జూడ
ఒంటిగచ్చే దానిని చూసి ఎనుక ఎనుకా వచ్చుడేలా
సిత్తురాల సిన్నవాడ సరసమాడ సమయమెలా
కారులు అచ్చనే నీల కారులు అచ్చే
కారులు అచ్చానే నా నీల, కారులు అచ్చానే నా నీల
కారులోన కుంకుమ పువ్వుల వాసనలు వచ్చేర నా బావ, వాసనలు వచ్చేర నా బావ
నెత్తి మీద గంపాను ఎత్తి నేల వంకల నువు పోతుంటే
మొగిలి పువ్వుల వెన్నెలా దాన మోము జూడే ఒకసారైనా
మత్తు జల్లే సూపుల తోటి మాటు కాసేద వేళ బావా
సాలు సాలు సరసాల మాట నువు వలికే జూటాల మాట
బస్సులు అచ్చనే నీల బస్సులు అచ్చే
బస్సులు అచ్చానే నా నీల, బస్సులు అచ్చానే నా నీల
బస్సులోనా బంతి పువ్వుల వాసనలు అచ్చేర నా దొర
వాసనలు అచ్చేర నా దొర
సిలకాల బాయి పోలము లోనా వంగి నాట్లు వేసేదాన
నడుము మీద ఉన్న మడత చెంతా రావే బంగారు సిలకా
కోర మీసాల చిన్నవాడ కొంటే సూపులు సూసుడు ఎలా
ఆపులే నీ మాయ ప్రేమా పడదులే ఈ సక్కటీ భామ
జీపులు అచ్చనే నీల జీపులు అచ్చే
జీపులు అచ్చానే నా నీల, జీపులు అచ్చానే నా నీల
జీపులోన జిలేబి పొట్లాల వాసనలు అచ్చేరా నా దొర
వాసనలు అచ్చేరా నా దొర
నువ్వు ఏసిన ముగ్గు ఎంతో ముద్దు నిన్ను సూడగా లేదే హద్దు
నిన్ను మెచ్చిన పిల్లవాని నీ వెంటే వచ్చేటోని
నాకు తోడు నీవు ఉండగా కలిసి రానా నీతో నీడగా
ఏలు పట్టక రావా బావా నిత్యం నన్ను ఏలుకోవా
లారీలు అచ్చనే నీల లారీలు అచ్చే
లారీలు అచ్చానే నా నీల, లారీలు అచ్చానే నా నీల
లారిలోనా లై లై పాటల లోల్లి జేయాంగ నా బావ
నీ తోడు నేనుంటారా నా బావ
లోల్లే జేయాంగా నా భామ నా తోడు నువ్వండవా నా భామ
నీ తోడు నేనుంటారా నా బావ
నీ తోడు నేనుంటారా నా బావ
Also Read: Ek Mutho Icchera Song Lyrics