Situkesthe Poye Pranam Song Lyrics penned by Ganu, music composed by Madeen SK, and sung by Hanmanth Yadav. The song was released on Apr 25, 2022, 3 months after the video get 41 million views on youtube.
Situkesthe Poye Pranam Song Lyrics in Telugu
ఎములాడ రాజన్న దేవుణ్ణి అడుగే
నీ మీదున్న ఇట్టం
కొండగట్టు అంజన్న స్వామిని మొక్కినానే
నీకు రావొద్దు కట్టం
సిటికేత్తే పొయ్యేటి పాణానికి
ప్రేమ సిక్కులు పెట్టినవేందే
బండ తీరు ఉండేటి నా గుండెకు
ఇన్ని భాధలు పెడుతున్నావేందే
ఆ దేవుణి మీద మన్నుపొయ్య
నీ ప్రేమకు బాకీ లేదేందే
బువ్వ తింటే పోతలేదే
నీ మీదే పాణమాయే
పిల్ల నీతోడు లేకపాయే
నాకు సావన్న రాకపాయే
ఎములాడ రాజన్న దేవుణ్ణి అడుగే
నీ మీదున్న ఇట్టం
కొండగట్టు అంజన్న స్వామిని మొక్కినానే
నీకు రావొద్దు కట్టం
ఎందుకే పిల్ల నా మీద కోపం
గుండె కోసి సూడు నీ రూపం
ఎందుకే పిల్ల నా మీద కోపం
నువ్వే కదనే నా లోకం
ఎందుకే పిల్ల నా మీద కోపం
ఏ జన్మల జేసిన పాపం
నా గుండెల దాగున్న
ఈ భాధ నువ్వే
నేనెవలితోని జెప్పుకోనే
ఆ దేవుణి మీద మన్నుపొయ్య
నీ ప్రేమకు బాకీ లేదేందే
బువ్వ తింటే పోతలేదే
నీ మీదే పాణమాయే
పిల్ల నీతోడు లేకపాయే
నాకు సావన్న రాకపాయే
ఎములాడ రాజన్న దేవుణ్ణి అడుగే
నీ మీదున్న ఇట్టం
కొండగట్టు అంజన్న స్వామిని మొక్కినానే
నీకు రావొద్దు కట్టం
నువ్వెట్లున్నవో ఇంటికాడా
నేను రాలేనే నిన్ను సూడా
నువ్వెట్లున్నవో ఇంటికాడా
నేను రాలేనే నిన్ను సూడా
నేనున్నది బాడరు కాడా
సచ్చిపోయిన తెలువదే జాడ
నా పాణం పోతున్నది
ఇట్ల సీకటి అయితున్నది
నువ్వు నా తొవ్వ సూడవోకు
నా అడుగుల్లో నువ్వు రాకు
కంట కన్నీళ్లు వెట్టవోకు
ఇంట దుఃఖాల పాలు గాకు
సిటికేత్తే పొయ్యేటి పాణానికి
ప్రేమ సిక్కులు పెట్టినవేందే
బండ తీరు ఉండేటి నా గుండెకు
ఇన్ని భాధలు పెడుతున్నావేందే
ఆ దేవుణి మీద మన్నుపొయ్య
నీ ప్రేమకు బాకీ లేదేందే
బువ్వ తింటే పోతలేదే
నీ మీదే పాణమాయే
పిల్ల నీతోడు లేకపాయే
నాకు సావన్న రాకపాయే
Also Read: Radha Rani Song Lyrics